![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఇస్తోన్న శ్రీసత్య, అర్జున్ ల మధ్య క్రష్ గురించి మరో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వీళ్ళిద్దరి మధ్య జరుగుతోన్న సీన్లు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయని చెప్పుకొవాలి.
ప్రతి సీజన్లో కంటెస్టెంట్ కి క్రష్ ఉండడం కామన్ గా మారిపోయింది. అలా ఎవరో ఒకరితో అయిన క్రష్ ఉంటే, హౌస్ లో ఎక్కువ రోజులు ఉంచుతారన్న విషయం కంటెస్టెంట్స్ కి బాగా తెలుసు అనుకుంట. అందుకే హౌస్ లో ఆటలో పెర్ఫార్మన్స్ కంటే ఇంప్రెస్స్ చేసే పనిలో బిజీ గా ఉన్నారు కంటెస్టెంట్స్. సీజన్లో మొదటి వారం నుండి అర్జున్ కి, శ్రీసత్య అంటే ఇష్టం అన్న విషయం అందరికి తెలిసిన విషయమే. కాగా శ్రీసత్య మాత్రం అర్జున్ తో మాట్లాడడమే మానేసింది. బిగ్ బాస్ 'హోటల్ టాస్క్' లో కూడా శ్రీసత్యకు ఫేవర్ గా ఆడడంతో హౌస్ మేట్స్ కి కోపం వచ్చింది. తర్వాత నాగార్జున కూడా మంచి కౌంటర్ ఇచ్చాడనే చెప్పాలి. కాగా శ్రీసత్య మిగతా హౌస్ మేట్స్ తో సన్నిహితంగానే ఉన్నా కూడా అర్జున్ తట్టుకోలేకపోతున్న సందర్భాలు లేకపోలేదు. శ్రీసత్య మాత్రం తన గేమ్ తన కోసం మాత్రమే ఆడుకోడానికి హౌస్ లోకి వచ్చాను అని చాలా సార్లు చెప్పింది. అర్జున్ కి కూడా పలుమార్లు 'నా మీద కాకుండా గేమ్ మీద ఫోకస్ చెయ్' అని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. ఒక వారం, " ఏం అర్జున్ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందా" అని నాగార్జున అన్నాడు. ఈ మధ్య వసంతి తో కూడా ఎక్కువ క్లోజ్ ఉండడం వల్ల, ఆ మాట అన్నట్లు తెలుస్తోంది.
రెండు రోజులుగా హౌస్ లో శ్రీసత్య, అర్జున్ ల మధ్య చిన్న హీటెడ్ ఆర్గుమెంట్ జరుగుతూ వస్తోంది. "నన్ను ప్రొవొక్ చేస్తున్నావ్" అంటూ అర్జున్ తో శ్రీసత్య అనగా, "నేను అలా అనలేదు" అని అర్జున్ చెప్పాడు. ఆ తర్వాత నాతో మాట్లాడకు అని అర్జున్ తో చెప్పింది శ్రీసత్య.
కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రేక్షకులు డైరెక్ట్ గా, "పాపం అర్జున్, కాస్త పట్టించుకో. మాకు ఎంటర్టైన్మెంట్ ఇంకా కావాలి" అని చెప్పారు. అయితే అర్జున్ తో శ్రీసత్య మాట్లాడి, ఎంటర్టైన్మెంట్ ఇంకా పెంచుతుందో లేదో చూడాలి.
![]() |
![]() |